Header Banner

అమెరికాలో ఆవిర్భవించిన కొత్త సిటీ! ఎలాన్ మస్క్ డ్రీం ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్!

  Sun May 04, 2025 15:08        U S A

అమెరికాలో మరో కొత్త నగరం ఆవిర్భవించింది. దీని పేరు స్టార్‌బేస్. టెక్సాస్‌లో అంతర్భాగంగా ఉంటూ వచ్చిన ఈ ప్రాంతం పరిధి మొత్తాన్నీ సిటీగా ప్రకటించింది ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

 

టెక్సాస్ బొకా చికా విలేజ్‌లో ఉంటుంది..స్టార్‌బేస్. ఇది- అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు అధినేతగా వ్యవహరిస్తోన్న ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందినది. ఆ సంస్థకు చెందిన రాకెట్ లాంచింగ్ ప్యాడ్ ఉండేదిక్కడే. స్టార్‌షిప్, డ్రాగన్ క్యాప్సుల్స్ వంటి స్పేస్ క్రాఫ్ట్స్, రాకెట్లను ఇక్కడి నుంచే అంతరిక్షంలోకి పంపిస్తుంటుంది.

 

ఇది కూడా చదవండి: గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అమెరికా ఆదేశాలు! అవి చూపిస్తేనే విమానంలోకి ఎంట్రీ!

 

అంతరిక్షానికి సంబంధించిన ఇతర పరిశోధనలను చేపడుతూ ఉంటుంది స్పేస్ ఎక్స్. ఈ సంస్థ ఉద్యోగులందరూ దాదాపుగా ఇక్కడే నివసిస్తుంటారు. ఫలితంగా- ఓ మినీ టౌన్‌షిప్ ఏర్పడింది. ఈ సంస్థ ఉద్యోగుల కోసం అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి.

 

బొకా చికా విలేజ్‌, స్టార్ బేస్ ఉన్న ప్రాంతం, స్పేస్ ఎక్స్ ఉద్యోగులు నివసిస్తోన్న ప్రాంతం మొత్తానికి కూడా సిటీ హోదా ఇవ్వడానికి సహకరించాలంటూ గత ఏడాది స్పేస్ఎక్స్ జనరల్ మేనేజర్ క్యాథరిన్ లారెడర్ స్థానికులకు లేఖ రాశారు. ఇప్పుడు తాజాగా ఓటింగ్ నిర్వహించారు. కామెరాన్ కౌంటీ ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ ఈ ఎన్నికలను జరిపింది. ఈ ఓటింగ్‌లో భారీ మెజారిటీ ఇవ్వడం ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేశారు స్థానికులు. మొత్తం 218 మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్‌బేస్‌కు సిటీ హోదా ఇవ్వడానికి అనుకూలంగా 212 మంది ఓటు వేశారు. ప్రతికూలంగా ఆరు ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.


ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Starbase #StarbaseCity #SpaceX #ElonMusk #SpaceCity #TexasStarbase